ఢిల్లీ శ్రద్ధావాకర్ తరహాలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ షాహ్డోల్లో రామ్కిషోర్ పటేల్, సరస్వతి పటేల్ దంపతులకు కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భార్యను రామ్కిషోర్ అనుమానంతో వేధించేవాడు. ఈ నెల 13న భార్యను గొడ్డలితో ముక్కలుగా నరికి చంపాడు. సరస్వతిపై మిస్సింగ్ కేసు నమోదవగా పోలీసులు విచారణ చేపట్టారు. అడవిలో మృతురాలి తల, మొండెం వేర్వేరు చోట్ల లభ్యమయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.