భూగర్భ జలవనరుల సంరక్షణలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సగటున 19.13 అడుగుల లోతుకే నీరు లభ్యమవుతున్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 667 మండలాల్లో నిర్వహించిన సర్వేలో ఈ వెల్లడైంది. ఆరు నెలల్లో రాష్ట్రంలో భూగర్భ జలాలు, 2.5 మీటర్ల మేర పెరగగా, ప్రస్తుత భూగర్భ జలాల రూపంలో 961.61 TMC నీటి లభ్యత ఉంది. భూగర్భ జలాల లభ్యతలో విజయనగరం తొలి స్థానంలో నిలవగా, ఏలూరు చివరి స్థానంలో నిలిచింది.