రాయలసీమ జిల్లాల మీదుగా వివిధ ప్రాంతాలకు తిరిగే మరికొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని నేటి నుండి( సోమ వారం)పెంచుతూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఆదివారం గుంతకల్లు రైల్వే డివిజనల్ ఉన్నతాధికారులు తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రేణిగుంట-గుత్తి-వాడి సెక్షన్లలో ఈ నెల 21 సోమవారం నుంచి గంటకు 130 కిలోమీటర్లు వేగంతో నడిచే రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి. జైపూర్-యశ్వంత్పూర్ -జైపూర్ మధ్య తిరిగే (రైలు నెం. 82654/53), గోరఖ్పూర్-యశ్వంత్ పూర్-గోరఖ్ పూర్ మధ్య తిరిగే వీక్లీ ఎక్స్ ప్రెస్(22533/34), తిరుపతి-జమ్ముతావి-తిరుపతి మధ్య తిరిగే (22705/06) హంసఫర్ వీక్లీ ఎక్స్ ప్రెస్, కడప-విశాఖ పట్నం-కడప మధ్య తిరిగే (నెం. 17 487/88)తిరుమల డైలీ ఎక్స్ ప్రెస్, తిరుపతి-నిజామాబాద్-తిరుపతి మధ్య తిరిగే (నెం. 12793/94) రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్లను అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్. హెచ్. బి బోగీ లతో నడపాలని రైల్వే శాఖ నిర్ణయిం చినట్లు అధికారులు తెలిపారు.