ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఏఎంవీఐ జాబ్ నోటిఫికేషన్ ను ఏపీ హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ లో ఇవ్వడం రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ తూ.గో జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం నోటిఫికేషన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.