ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో నరసాపురం ఖాకీవనంలా మారింది. పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. బందోబస్తు కోసం పశ్చిమగోదావరి జిల్లా నుంచే కాకుండా కృష్ణా, తూర్పు జిల్లాల నుంచి కూడా దాదాపు 2 వేల మంది పోలీసులను రప్పించారు. సీఎం దిగే హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు దాదాపు 5 కిలోమీటర్ల పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో జనం రోడ్డు మీదకు రాకుండా తెరలు కడుతున్నారు. ఆదివారం పాతబజార్లోని దుకాణాలన్నీ మూసివేశారు. ఈ ఆంక్షలు సోమవారం సీఎం వచ్చి వెళ్లే వరకు ఉంటాయని.. దుకాణాలు మూసివేయాల్సిందేనని ఆదేశించారు.