అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన స్థలాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. వెనక్కి పంపిన జాకీ పరిశ్రమని ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడే స్థాపించాలని డిమాండ్ చేశారు. జాకీ పరిశ్రమ ఇక్కడే స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రాప్తాడుకు వచ్చిన జాకీ పరిశ్రమ వెనక్కి పంపిన రాప్తాడు ఎమ్మెల్యే నిర్లక్ష్యం నశించాలని అన్నారు. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణి మానుకొని పరిశ్రమ ఇక్కడే స్థాపించడానికి కృషి చేయాలంటూ సీపీఐ నేతలు నినాదాలు చేశారు.