ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. కర్మయోగి ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన సోము వీర్రాజును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి చెప్పడంతో సిబ్బంది అనుమతించారు. తనను లోపలికి పంపించారా? అంటూ సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై సోము వీర్రాజు మండిపడ్డారు. దీంతో గేట్ వద్ద ఉన్న సిబ్బందికి తెలియదని అధికారులు సర్దిచెప్పారు.