వైసీపీ నేత కొడాలి నాని పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అపోలో నుండి వచ్చిన కొడాలి నానికి.. కిడ్నీతో పాటు బ్రెయిన్‌కు కూడా సర్జరీ జరిగినట్లుందని యెద్దేవా చేశారు. కొడాలి బతుక్కి చంద్రబాబు, లోకేష్ కావాలా దమ్ముంటే తనపై గెలవాలని ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్‌కు ఇదే చివరి ఛాన్స్ అని తెలిపారు. హీరో అనుకుంటున్న కొడాలి లెక్కలన్నీ ఆధారాలతో తమ వద్ద ఉన్నాయన్నారు. అవినీతి సొమ్ముతో 2024 ఎన్నికల్లో బంగారు ముద్దలు ఇచ్చిన కొడాలి నాని ఓటమి తథ్యమని స్పష్టం చేశారు. ‘‘జగన్ కు దమ్ముందా ప్రజల్లోకి రావడానికి.. ముఖ్యమంత్రి అయ్యిండి పరదాలు కప్పుకొని రోడ్లపైకి వస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ప్రజల ఆగ్రహానికి వైసీపీ నేతలు కొట్టుకుపోతారని రావి వెంకటేశ్వరరావు అన్నారు.