భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ టై అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 160 రన్స్ కి ఆలౌటైంది. అనంతరం 161 లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 9 ఓవర్లలో 75/4 స్కోర్ చేసింది. వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను టై గా ప్రకటించారు. దీంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది.