పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నపుడు విదేశాలలో అందుకున్న బహుమతుల దుర్వినియోగంపై ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పాక్ మంత్రి క్వాజా ఆసిఫ్ సైతం విమర్శలు గుప్పించారు. క్రికెటర్ గా ఉన్నపుడు కూడా అనేక బహుమతులను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నాడని మండిపడ్డారు. భారత్ ఇచ్చిన ఓ బంగారు పతకాన్ని ఇలాగే అమ్మారని, దాన్ని రూ.3 వేల కంటే తక్కువకే ఇమ్రాన్ నుంచి తాను కొనుగోలు చేశానని తెలిపారు.