రైతుల కోసం తెలుగుదేశం పేరుతో పరిటాల సునీత చేపట్టిన పాదయాత్ర రాప్తాడు మండలానికి చేరుకుంది. తన పాదయాత్రకు పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారని, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రకు రాకుండా రైతులను చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడే ఆపేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపేది లేదని సునీత తేల్చిచెప్పారు.