విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఓ స్కూల్ ప్రిన్సిపల్ దారి తప్పాడు. ఫుల్లుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. ఆపై షర్టు విప్పేసి పడుకున్నాడు. మహారాష్ట్రలోని అమరావతి పరిధి మెల్ఘట్లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ప్రిన్సిపల్‌పై తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.