తీహార్ జైలులో ఉన్న ఆప్‌కు చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జైన్ మసాజ్ వీడియోను విడుదల చేసిన కొన్ని రోజులకే ఆయన సెల్లో విలాసవంతమైన భోజనం చేస్తున్న వీడియోను బీజేపీ షేర్ చేసింది. సలాడ్ లు, రుచికరమైన, పోషక విలువలున్న భోజనంతోపాటు వాటర్ బాటిళ్లు కూడా జైన్ వద్ద ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. ఇక జైన్ జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే.