త్రిపుర రాష్ట్రంలో అధికారులు అక్రమ మద్యం షాపులపై కొరడా ఝలిపిస్తున్నారు. దీనిలో భాగంగా అగర్తా జిల్లా అధికారులు అగార్తాలోని పలు అక్రమ మద్యం షాపులపై ఉక్కుపాదం మోపారు. జిల్లా కేంద్రంలోని అక్రమ మద్యం దుకాణాలను జేసీబీల సాయంతో అధికారులు కూల్చివేశారు. త్రిపుర రాష్ట్రాన్ని మద్యం,మత్తు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.