ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. డిసెంబర్ 5వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి చంద్రబాబును ఆహ్వానించారు. తదుపరి జీ20 భాగస్వామ్య దేశాల సదస్సు భారత్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు గురించి పార్టీల అధ్యక్షుల సమావేశంలో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాజకీయ పార్టీల సూచనలు, అభిప్రాయాలను కేంద్ర తెలుసుకోనుంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa