ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దు: వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 08:35 PM

ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని కోరారు. చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని... దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేదే కొలమానంగా పెట్టుకోవాలని... మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు.


ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రైతులకు భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  తనకు తాను పార్టీ పెట్టుకుని వచ్చిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని... కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేసిన వాళ్లను చంద్రబాబు అంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని కోరారు. 


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వేను చేపడుతున్నామని జగన్ తెలిపారు. 17 వేలకు పైగా గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామని చెప్పారు. తొలి దశలో 2 వేల గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని తెలిపారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుందని తెలిపారు. సర్వే కోసం 13,849 మంది సర్వేయర్లను నియమించామని... రూ. 1,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. భూముల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa