గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ శ్మశాన వాటికలో అబ్దుల్ రజాక్ మన్సూరీ అనే ఓ ముస్లిం వ్యాపారి నడుపుతున్న ‘లక్కీ టీ స్టాల్’ అదృష్టం తెస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఇక్కడ సమాధులకు అటు ఇటు వేసిన బల్లలపై పూర్తిగా శాఖాహారమే వడ్డిస్తారు. స్టాల్ సిబ్బంది రోజూ సమాధులను శుభ్రం చేసి వాటిపై పువ్వులను ఉంచుతారు. ఇందులో టీ తాగితే అదృష్టం వరిస్తుందని.. అందుకే ఇక్కడికి వచ్చిన వారు టీ తాగి సమాధులపై వస్త్రం కప్పి ప్రార్థిస్తారు. మతంతో సంబంధం లేకుండా అంతా ఈ టీ స్టాల్ ను సందర్శిస్తారు.