ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో యువతితో భర్తకు ఎఫైర్.. భార్య ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 12:36 PM

భర్త మరో యువతితో ఎఫైర్ పెట్టుకోవడంతో పెళ్లైన 11 నెలలకే భార్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్ లో ఈ నెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభిషేక్, శ్వేత దంపతులకు 11 నెలల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు అభిషేక్ కు వేరే యువతితో ఎఫైర్ ఉంది. పెళ్లైన తర్వాత కూడా అభిషేక్ ఆమెతో ఎఫైర్ కొనసాగించాడు. ఈ విషయం శ్వేతకు తెలియడంతో భర్త చేసిన మోసం తట్టుకోలేక ఆమె ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. శ్వేత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com