మధ్యప్రదేశ్ కు చెందిన అంతర్ అనే యువకుడు ఐదేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అయితే తాజాగా ఆ అమ్మాయి అంతర్ తో పెళ్లికి నిరాకరించి వేరే అబ్బాయితో నిశ్చితార్ధం చేసుకుంది. దీంతో అంతర్ ఆ అమ్మాయి ఊరిలోనే ‘ఎం బేవఫా ఛాయ్ వాలా’ అనే టీ కొట్టును ప్రారంభించాడు. తాను ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే తన పేరు పెట్టాలని గతంలో తన ప్రియురాలు కోరడంతోనే ఇలా టీ కొట్టుకు ఆమె పేరు పెట్టానని అంతర్ చెబుతున్నాడు.