పని తీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతోన్న రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకోసారి ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకూ 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల పని తీరు విషయంలో కఠిన నింబంధనలు తీసుకొచ్చారు.