ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాకు ఈయూ షాకిచ్చింది. రష్యాను ‘ఉగ్రవాద ప్రోత్సాహక దేశం’గా యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. ఈ తీర్మానానికి ఈయూ పార్లమెంట్ లో ఓటింగ్ నిర్వహించగా 494 మంది సభ్యులు మద్దతు పలికారు. 58 మంది వ్యతిరేకించగా.. 44 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఉక్రెయిన్ లోని విద్యుత్ సంస్థలు, ఆస్పత్రులు, పాఠశాలలు, పౌరుల నివాసాలపై రష్యా దాడితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈయూ తెలిపింది.