వ్యాపార సామ్రాజ్యం దివాలా తీయడంతో తనకున్న రూ.52 కోట్ల అప్పు తీర్చడానికి మాంసం అమ్ముకుంటున్నాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. చైనాకు చెందిన తాంగ్‌జియన్ రెస్టారంట్ల వ్యాపారంలో కోట్ల ఆస్తులు పోగేశాడు. 2005లో ల్యాండ్‌స్కేప్ ఇంజనీరింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. దీంతో ఆయన కార్లు, బంగ్లాలు, ఆస్తులు అన్నింటినీ అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా రూ.52 కోట్ల అప్పులు మిగిలాయి. అవి తీర్చటం కోసం మాంసంతో తయారు చేసిన ఆహారపదార్థాల విక్రయం మొదలుపెట్టారు. హాంగ్‌ఝౌలోని ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జీవితం పెట్టిన పరీక్షలను ఎదుర్కొంటోన్న ఆయన పలువురికి స్పూర్తిగా నిలిచారు.