నలుగురు ఫారెస్ట్ గార్డులను హతమార్చిన చిరుతను బంధించిన అధికారులు దాన్ని జీవితాంతం బోనులోనే ఉంచాలని నిర్ణయించారు. యూపీలోని లఖింపుర్ ఖేరీ జిల్లా గోలా తహసీల్ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 20 వరకూ చిరుత దాడిలో నలుగురు చనిపోయారు. దీంతో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు చిరుత కదలికలు గమనించి.. ఆరో చోట్ల బోన్లతో ట్రాప్ చేసి సోమవారం చిరుతను పట్టుకున్నట్లు చెప్పారు.