‘‘గుంటూరులో కూల్చివేతల కలకలం. నోటీసివ్వకుండా కూల్చివేత’’ అంటూ వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం. చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణకు 2015లోనే అధికారులు నోటీసులు ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి ప్రహరీలు, రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు తొలగించారు. డొంక రోడ్డు కూడలిలో ట్రాఫిక్ సమస్యతో వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారు. దీని పరిష్కారానికి రోడ్డు విస్తరణ చేపట్టిన అధికారులు ఇందుకు అంగీకరించిన వారి ప్రహరీ గోడలు మాత్రమే కూల్చారు. వీరికి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. రోడ్డు ఆక్రమించి నిర్మించిన ఇళ్లను తొలగించారు అంటూ గవర్నమెంట్ ఆఫీసియల్ గా తెలియజేసింది.