సుప్రీంకోర్టు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే పోర్టల్‌ను గురువారం ఆవిష్కరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసి, సమాచారాన్ని పొందడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. న్యాయశాస్త్ర విద్యార్థులు ఆకృతి అగర్వాల్, లక్ష్య పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం ఈ వివరాలను తెలిపింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునేందుకు ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో ఏదైనా సమస్య తలెత్తితే తనను సంప్రదించవచ్చునని చెప్పారు.