నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ఆర్థిక అంశాలను చర్చించేందుకే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి కావలసిన మరిన్ని రుణాలకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను గుర్తించి, రుణాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని బుగ్గన రాజేంద్రనాథ్ కోరే అవకాశం ఉంది. దీనికి కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.