గుంతకల్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన కమిటీని గురు వారం స్థానిక మార్కెట్టు యార్డులో 34 సచివాలయ ఉద్యోగులు సమా వేశమై ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా కె. రమేష్ రావు (వెల్ఫెర్ కార్యదర్శి), ప్రధాన కార్యదర్శి గా ఇంద్రసేనా రెడ్డి(అడ్మిన్ కార్య దర్శి), సహాయ కార్యదర్శిగా మంజు నాథ్ (ఎడ్యుకేషన్), కోశాధికారిగా శ్రీధర్(శానిటేషన్ కార్యదర్శి) ఉపా ధ్యక్షులుగా వరప్రసాద్, అనిల్ కుమార్, పుష్యమి, చిట్టిబాబు, విజయ భారతి, సుదర్శన్, శ్రీనివాసులు, యోగనంద్, నబిరసూల్ తోపాటు సంయు క్త కార్యదర్శిలుగా తొమ్మిది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కె. రమేష్ రావు, ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం రాజీలేని పోరా టాలు చేస్తామన్నారు.