ఆర్టీసీ సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమణమ్మ కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని ఆమె పై చర్యలు చేపట్టాలని గురువారం ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూని యన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సెక్యూరిటీ హెడ్ కాని స్టేబుల్ గిరి ధర్, సీనియర్ అసిస్టెంట్లకు వేర్వేరు గా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ ఎస్టిఐ గుత్తిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతోందన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అసభ్య పద జాలంతో దూషిస్తోందని అన్నారు. ఆమె వేధింపులకు డ్రైవర్లు, కండక్టర్లు మనస్థాపానికి గురవుతున్నారని చెప్పారు. ఆమె వేధింపులపై గతంలో అధికారులకు విన్నవించామని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి ఆమెపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూని యన్ కార్యదర్శి పి. కంబగిరి రాముడు, డిపో కార్యదర్శి వి. జ్ఞానే శ్వర్, నాయకులు ఎస్. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.