మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్ల పాడు సమీపంలో రెనాల్డ్స్ కార్ల షో రూమ్ లో ఏడు లక్షల విలువైన రెండు సెన్సార్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షోరూం సర్వీస్ మేనేజర్ గా పనిచేస్తున్న భాస్కర్ ప్రసాద్ ఈనెల 20వ తేదీన ఉదయం షోరూం కి రాగా వాచ్మెన్ గా పనిచేస్తున్న వెన్నెల రాత్రి నుంచి కరెంటు లేదని తెలిపారు. దీంతో లోపలికి వెళ్లి చూడగా మీటర్స్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని స్పేర్ పార్ట్స్ గదిలో ఉన్న రెండు సెన్సార్లు కనిపించడం లేదని గుర్తించారు. ఈ సందర్భంగా వారి ఫిర్యాదు మేరకు గురువారంనాడు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు.