సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో 2019లో తన భార్య తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని వల్లపు లక్ష్మయ్య కంబపు శీను పై యాసిడ్ ను తలపై పోశాడు. అనంతరం శీను చికిత్స పొందుతున్న మృతి చెందాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమశేఖర్ గురువారం నాడు నిందితుడు వల్లపు లక్ష్మయ్యకు జీవిత ఖైదు మరియు లక్ష ఇరవై వేల రూపాయలు అపరాధ రుసుము విధించి పరిహారం చెల్లించవలసిందిగా తీర్పు వెలువరించాడు. సదరు హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న అధికారులను కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.