ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. ఫలితంగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. శీతాకాలం కారణంగా ఇప్పటికే ఉక్రెయిన్ లోని అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది.