డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఎం. నర్సింహమూర్తి అన్నారు. గురువారం పోలాకి మండలం నరసాపురంలో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నాయన్నారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్, బ్యాంక్ లావాదేవీ లపై ఇతరులపై ఆధారపడవద్దన్నారు. ఇతరులకు పిన్, ఓటీపీలను చెప్పవద్దన్నారు. బ్యాంక్ మేనేజర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని లేదా బ్యాంక్ లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎం. ఈశ్వరరావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.