స్మార్ట్‌ఫోన్ వ్యసనంపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. వృద్ధులు తలలు వంచి, రెండు చేతులను పైకి లేపి ఫోన్ పట్టుకున్నట్లుగా ఓ కార్టూన్‌ను ఆయన ఇవాళ షేర్ చేశారు. ‘’నిజానికి ఈ కార్టూన్ తీవ్రంగా నిరుత్సాహ పరుస్తుంది. కానీ ఫోన్‌ను పక్కకు పెట్టాలనే నిర్ణయం తీసుకునేలా చేసింది. ఈ ట్వీట్ తర్వాత.. నా ఫోన్‌ను పక్కన పెట్టేస్తా. ఈ రోజు మొత్తం తల నిటారుగా పెట్టే గడిపేస్తా’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నిజంగా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa