ట్విట్టర్‌ను దక్కించుకున్న ఎలాన్ మస్క్ తన మాస్టర్ ప్లాన్‍ను అమలు చేసేందుకు సిద్దమయ్యారు. సోషల్ మీడియా నెట్‍వర్క్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్‍గా ఉన్న ట్విట్టర్ స్వరూపాన్ని మార్చేందుకు ప్లాన్‌చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని స్లైడ్‍లను ట్విట్టర్ లో ఇవాళ పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో ఎన్‍క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‍ల సర్వీస్‍ను తీసుకురానున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్‍లా ట్విట్టర్‌లోనూ చాట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ట్విట్టర్‌లోనూ పేమెంట్స్ సదుపాయం వస్తుందని స్లైడ్స్ ద్వారా తెలుస్తోంది. మిగతా పేమెంట్ యాప్‌ల్లాగా ట్విట్టర్ పనిచేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa