టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ స్కామ్లో నారా లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయమని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. రూ. 321 కోట్ల ఫైబర్ నెట్ స్కామ్ లో జైలుకు వెళ్లక తప్పదు పప్పూ! అక్కడ మూడుపూట్లా పప్పు భోజనం ఏర్పాటు చేసుకో. వేమూరి హరికృష్ణ చౌదరి అన్నీ కక్కుతాడు. ఇంటింటికి టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులివ్వమని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే పందికొక్కుల్లా తినేశారు కదరా! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.