తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెండు జిల్లాల ఎస్పీలకు ఫిర్యాదు చేశామని పరిటాల సునీత తెలిపారు. రామగిరి సీఐ లాంటి వాళ్లు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎస్పీలకు చెప్పినా చలనం లేదని విమర్శించారు. తప్పు ఏదైనా చేస్తే కేసు పెట్టుకోవచ్చని, లేనిపోని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తమను కొట్టింది వైసీపీ వాళ్లే కానీ.. కొట్టింది వైసీపీ వాళ్లు, దెబ్బలు తిన్నది మావాళ్లు అయితే... పోలీసులు మావాళ్ల పై కేసులు పెట్టారని తెలిపారు.