‘రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా.. రైతన్నలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ, అండగా నిలబడుతూ మన మూడు సంవత్సరాల ఐదు నెలల పాలన సాగింది’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం వైయస్‌ఆర్ సున్నావడ్డీ అనే ఒకే ఒక్క పథకం ద్వారా రైతులకు రూ.25,971 కోట్లు అందించగలిగామని, సున్నావడ్డీ పంట రుణాలు క్రమం తప్పకుండా ఇవ్వడంతో పాటు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియకమునుపే రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. 2022 జూలై–అక్టోబర్ మధ్య (ఖరీఫ్‌లో) కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రూ.39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, వైయస్‌ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు రబీ2020–21, ఖరీఫ్ 2021లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతన్నలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ నేరుగా జమ చేశారు.