ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సూరత్ లో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఓ చిన్నారి గాయపడినట్లు ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా తెలిపారు. బీజేపీ గూండాలే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ దాడిని కేజ్రీవాల్ ఖండించారు. తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందని నిలదీశారు.