కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఓటు హక్కు, స్కూల్ అడ్మిషన్ సహా అన్నింట్లోనూ జనన ధ్రువీకరణ పత్రాన్ని (బర్త్ సర్టిఫికెట్) తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు జనన, మరణ ధ్రువీకరణ చట్టం-1969ని సవరించేందుకు ముసాయిదా రూపొందించింది. దేశవ్యాప్తంగా రియల్ టైమ్ లో సమాచారం అప్ డేట్ అవ్వనుంది. 18 ఏళ్లు నిండగానే ఆటోమేటిక్ గా ఓటు హక్కు కల్పించడం, మరణిస్తే తొలిగించడం వంటివి చేస్తుంది.