గ్యాంగ్ స్టర్, ఉగ్రవాద ముఠాలపై మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. గ్యాంగ్ స్టర్- టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్ సీఆర్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు జరిపింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్ స్టర్లను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై ఆరా తీస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్ పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్ స్టర్లను విచారించిన అనంతరం ఈ దాడులు ప్రారంభించింది.