బీహార్‌లోని సోనేపూర్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. స్థానికంగా జాతరకు ఇటీవల తన స్నేహితురాళ్లతో కలిసి ఓ యువతి వచ్చింది. అదే సమయంలో తన ప్రియుడు మరో యువతితో తిరగడం చూసింది. దీంతో ఆమె కోపంతో ఊగిపోయింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రియుడితో తిరుగుతున్న యువతిపై దాడి చేసింది. జుట్టు పట్టుకుని లాగి, కాలితో తన్నింది. ఆమెకు ఫ్రెండ్స్ కూడా సాయపడ్డారు. నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువతిని దారుణంగా కొట్టారు. దుస్తులు చిరిగి పోయినా వెనక్కి తగ్గకుండా ఘర్షణ పడ్డారు.