న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తుది పోరుకు సిద్ధమైంది. బుధవారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. రెండో మ్యాచ్ వర్షం పడింది. మూడో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని, టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆతిథ్య న్యూజిలాండ్ భావిస్తోంది. మరోవైపు విజయం సాధించి సిరీస్‌ను కాపాడుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ మ్యాచ్ కు ముందు క్రైస్ట్ చర్చ్ రికార్డులు టీమ్ ఇండియాను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వేదికపై టీమిండియా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇక్కడ న్యూజిలాండ్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 11 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2018లో ఇంగ్లండ్ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఈ రికార్డు గబ్బర్ సేనను భయపెడుతోంది. పిచ్‌పై గెలవాలంటే కివీస్ స్థాయికి మించిన ప్రదర్శన చేయాలి. అయితే ఈ గొప్ప రికార్డును టీమ్ ఇండియా తిరగరాస్తుందో లేదో చూడాలి. క్రైస్ట్ చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ పిచ్ భిన్నంగా ఉంది. బ్యాటర్లు మరియు బౌలర్లు ఇద్దరూ మద్దతు ఇస్తారు. ఈ వేదికపై భారీ స్కోర్లు నమోదయ్యాయి. అలాగే బౌలర్లు తమ సత్తా చాటిన సంఘటనలు ఉన్నాయి. సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే వారు ఇక్కడ ఏ బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా, సాంకేతికంగా ఆడితే భారీ స్కోర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మైదానంలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 262.
తుది జట్లు(అంచనా)
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్