కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పంపిన 20 దస్త్రాలను కేంద్రం వెనక్కి పంపింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై కేంద్రం బలమైన అభ్యంతరాలు లేవనెత్తిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తిప్పి పంపిన 20 దస్త్రాల్లో 11 కొత్త సిఫార్సులని తెలిపాయి.