ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు దొంగగా మారాడు ఓ యువకుడు. అస్సాంకు చెందిన దీపోంకర్ నోమోసుందర్ విల్సన్ గార్డెన్ లోని యూనియన్ బ్యాంకు ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఏటీఎం నింపేందుకు వచ్చిన సిబ్బంది నమ్మకాన్ని సంపాదించి ఐడీ, పాస్ వర్డ్ తెలుసుకున్నాడు. అనంతరం రూ.19.96 లక్షలు దొంగిలించి చాపర్ ముఖ్ జిల్లాకు వెళ్లి తలదాచుకున్నాడు. సీసీల ఆధారంగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి రూ.14.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.