తల్లి అయ్యేందుకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు మంచిదని గైనాకాలజిస్టులు చెబుతున్నారు. 35ఏళ్ల తర్వాత తల్లికావడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. 25 నుంచి 35ఏళ్లు తల్లి కావడానికి సరైన వయసని, కానీ, ప్రస్తుతం చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతోన్న కొద్దీ అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, ఫెర్టిలిటీ టెస్టు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. శరీరంలో ఎన్ని అండాలు ఉన్నాయో ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఒకవేళ అండాలు తక్కువగా ఉంటే ప్రమాదమని అంటున్నారు.