దోమలు మనల్ని విపరీతంగా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. దోమలు కుట్టడం వలన టైఫాయిడ్, మలేరియా వ్యాధులు సంక్రమించి ఒక్కోసారి ప్రాణాలనే హరిస్తుంటాయి. అయితే, మన వంటింట్లోని చిన్న చిన్న చిట్కాలతో దోమలను తరిమికొట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాసింత టీ పొడిని ఒక పాత్రలో వేసి స్టవ్ పై పెట్టి కాల్చితే ఈ ఘాటుకు దోమలు దూరమవుతాయని ఒక సర్వేలో తేలింది. అలాగే, పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి, ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి. అంతే కాకుండా, ఒక గ్లాసులో సగానికి పైగా నీళ్లు తీసుకొని, అందులో కర్పూరం బిల్లలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటకు పారిపోతాయి.