ముఖ్యమంత్రి జగన సీమ వాసిగా ఉంటూ. రాయలసీమకు -పదే పదే మోసం చేయడం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టును సీమలోని కర్నూల్ లో ఏర్పాటు చేస్తామని జగన్ పదే పదే ఒక వైపు చెబుతూనే, మరోవైపు హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకి తరలించే అంశం ముగిసిన అధ్యాయమని నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది. వేణుగోపాల్ సుప్రీం కోర్టులో చెప్పారని అన్నారు.