ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబరు ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు ‘ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి ’ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 02:03 PM

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలతో మరింతగా మమేకమై.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా.. అందుకూ సంసిద్ధమై ఉండాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై జనాలను చైతన్యం చేసేలా అధిష్ఠానం తెలుగు తమ్ముళ్లకు దిశా నిర్దేశం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు ‘ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి ’ పేరుతో నియోజకవర్గాల వారీగా కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరై.. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలుగు తమ్ముళ్లకు నిర్దేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com