2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుంతోంది. ఈ మేరకు ఏడాదిన్నర ముందే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేసి ఈ పదవుల్లో నియమించారు. గతంలో ఏ జిల్లాకు సంబంధించిన నాయకులు ఆ జిల్లాకే పరిశీలకులుగా నియమించగా ప్రస్తుతం పొరుగు జిల్లాల వారిని నియమించారు. వైయస్ఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురిని పరిశీలకులుగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa