జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకు జూలై- సెప్టెంబర్ త్రైమాసికం నిధులను నేడు సీఎం జగన్ విడుదవ చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలలో సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్నారు. దీంతో 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. జగనన్న విద్యాదీవెన, వసత దీవెనల పథకాల కింద ప్రభుత్వం మొత్తం రూ.12,401 కోట్లు విడుదల చేసింది. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదని ఈ పథకం కింద ప్రభుత్వం పూర్తి రీయంబర్స్ మెంట్ ను చెల్లిస్తోంది. తల్లిదండ్రులపై భారంగా పడకుండా కాలేజీ మొత్తం ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది.